Header Banner

ఊర్లోకి వచ్చిన ఎలుగుబంటికి గ్రామస్థుల చిత్రహింసలు.. వారి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 వేల!

  Sun Apr 13, 2025 15:21        India

దారి తప్పి గ్రామంలోకి వచ్చిన ఓ ఎలుగుబంటికి గ్రామస్థులు నరకం చూపించారు. దానిని చిత్రహింసలకు గురిచేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిందీ ఘటన. గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటిని బంధించిన గ్రామస్థులు దానిపై దాడిచేశారు. దాని నోటిని విరిచేశారు. కాలి గోళ్లను తొలగించారు. అది నొప్పితో విలవిల్లాడతున్నా విడిచిపెట్టకుండా దారుణానికి పాల్పడ్డారు. బాధ భరించలేని ఎలుగుబంటి చివరికి ప్రాణాలు విడిచింది. ఇందుకు సబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అటవీశాఖ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. నిందితుల ఫొటోలను విడుదల చేసింది. వారి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 వేల నజరానా ప్రకటించింది. ఎలుగుబంటి విషయంలో గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆర్‌సీ దుగ్గ పేర్కొన్నారు. దానిని చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తులను పట్టుకుంటామని, కఠిన శిక్ష తప్పదని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chhattisgarh #SukmaDistrict #AnimalCruelty #ForestDepartment #ViralVideo #WildlifeCrime #BearTorture #India